అనగనగ ఒక వూరిలో ఒక రాజు ప్రతి సంవత్సరం వేల మంది భాహ్మనులని ని పిలచి కిలో బంగారం దానం ఇస్తూ ఉండేవాడు. కానీ ప్రతి సారి ఒక ప్రశ్న అడుగుతూ ఉండే వాడు. "అంతకి ఇంతితే ఇంతకి ఎంత?". ఒక్క బ్రాహ్మణుడు కూడా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక పోయే వాడు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఒక బ్రాహ్మణుడు సమాధానం చెప్పాడు. "ఇంతకి ఇంతే ". ఆరోజు నుండి రాజుగారు ఇక దానాలు మనివేసారు కానీ మంచిపనులు చేస్తూనే ఉన్నారు.
ఆ రాజు గత జన్మలో ఒక సామాన్య జీవితం గడుపుతున్న ఒక బ్రాహ్మణుడు. ప్రతిరోజు 5 ఇళ్ళలో బిచ్చమెత్తుకుని ఆ దానం తోనే అతడు అతడి కుటుంబం బ్రతుకుతూ ఉండెడివారు. అందుకుంచే ఎవరినా అడిగితే దానం ఇచ్చేవారు. ఒక రోజు ఒక యక్షుడు అతడిని పరిక్షించటానికి మారువేషంలో వచ్చి ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని అడిగాడు.
బ్రాహ్మణుడు తన వంతు భాగాన్ని అతడికి దానం చేసాడు. కానీ ఆ యక్షుడు ఇంకా ఆకలిగా ఉంది అని బాధగా చూస్తున్నాడు. అప్పుడు అతడి భార్య తన వంతు దానమిచ్చింది. అయిన ఆ యక్షుడి ఆకలి తీరలేదు. అప్పుడు బ్రాహ్మణుడి పిల్లలు కూడా తమ వంతు దానం చేసారు. ఆ రాత్రి ఆకలి బాధతో ఆ కుటుంబం మరణించారు. ఆ జన్మలో చేసిన పుణ్యమ్ వలన ఆ బ్రాహ్మణుడు రాజుగా జన్మించాడు. అతడికి గత జన్మ జ్ఞానం కూడా తెలియటం వలన మల్ల్లీ దానాలు చేస్తూ ఈ ప్రశ్న అడుగుతూ ఉండేవాడు. ఆరోజు ఒక రోజు భోజనం దానం చేస్తే ఈ రాజ జన్మ వస్తే ఇప్పుడు చేసే ఈ దానం వలన ఇంకీంత ఉద్గతి వస్తుంది అని అతడి ప్రశ్న. ఒక సద్బ్రహ్మనుడు అతడి ప్రశ్న అర్దం చేసుకుని తగిన సమాధానం ఇచ్చాడు. ఇంతకి ఇంతే. అంటే ఇంకేమి రాదు అని.ఇందులో రెండు అర్ధాలు ఉన్నాయి.
ఫలితం ఆశించి చేసే దానాలకు పుణ్యం రాదు. అంతే కాదు.మనలని ఇక్కడికి తెచ్చిన పుణ్యం మరి ఎక్కడికో తీసుకు పోదు.
తెల్లవాళ్ళు ఇవన్నీ మన నుండి నేర్చుకుని పుస్తకాలు రాస్తున్నారు. ఉదాహరణకి "what brings you here doesnt take you there" అటువంటి పుస్తకమే.
No comments:
Post a Comment